Friday, August 17, 2007
మతి పోతుందా ...
... గతంలో నేను రాసిన రాతలు చదివి? (అడపా దడపా చదువుతున్నవారికి). అవును మరి, అందరూ మంచివే రాస్తుంటే, అన్నీ మంచివే చదువుతుంటే కొన్నాళ్ళకు మొహం మొత్తేస్తుంది, ఆస్ట్రేలియా మ్యాచ్ చూస్తున్నట్టు.
నవ్వుకోడానికి జోకులతో పాటు ఇలాంటివి కూడా ఉంటే కొంచెం ఆటవిడుపుగా ఉంటుంది, ఏమంటారు? చిన్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ చిత్రాలు చూసేవాళ్ళం నవ్వుకోడానికి (అభిమానులు మన్నించాలి). ఎంత భాధలో ఉన్నా సరే కృష్ణ చిత్రం చూడగానే, అన్నీ మరిచిపోయి హాయిగా నవ్వుకొనేవాళ్ళం, ఇది కూడా అలాగే అన్న మాట.
అప్పుడే అయిపోలేదు మరి కొన్ని ఉన్నాయి, అవి కూడా రాస్తాను, చదివి ఆనందించండి. ఆ.. కొన్ని అప్పట్లో చాలా ఫీలయ్యి (ఇక మన పని అంతే!) రాసాను, అవి కూడా త్వరలో రాసి మిమ్మల్ని ఆనందింపచేస్తాను. :)
బ్లాగర్ టెంప్లేట్స్
సబ్ స్రైబ్ టు
:
పోస్ట్స్ (ఆటం)
0 అభిప్రాయాలు:
మీ అభిప్రాయం