Tuesday, August 7, 2007
ప్రాస కోసం ప్రాకులాట
నా స్నేహితుడు గోకుల్ అంటుండేవాడు, నువ్వు ప్రాస కోసం ప్రయాస పడకు, ప్రాస వుంటే అది కవిత అయిపోదు, రాసేదానిలో విషయం ఉండాలి, మనసు ఉండాలి, మనసులోని భావాలని మాటలుగా రాయడమే కవిత అంటే. అంతే గాని, ఏదో నాలుగు ముక్కలు రాసి కవిత రాసాను అనకు అని.
అక్షరాలా నిజం. కాని మనకు అంత ఎక్కడ ఏడ్చింది. తెలుగులో ఉద్దండులం కాము, గొప్ప పుస్తకాలు చదివింది లేదు, అయినా వచ్చిన భాషతో రాసేద్దామని తపన. అలా మొదలైన నా రాతలు ఇంతకంటె ఏం గొప్పగా ఉంటాయి మరి. మనకున్న భాషతో, మనకొచ్చిన ఆలోచనలతో రాద్దామని రాసేవాడిని. ప్రాస కోసం ప్రయాస కాదు గాని, చాలా వరకు ప్రాసతోనే రాయగలిగేవాడిని. అదండీ సంగతి.
మరొక్క సంగతి, కొన్నింటిలో అశ్లీలం కొద్దిగా వుంటుంది, క్షమించాలి. గతంలో రాసుకున్నవి ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ ఉంచుదామని ఏమీ మార్చకుండా ప్రచురించేస్తున్నా.
బ్లాగర్ టెంప్లేట్స్
సబ్ స్రైబ్ టు
:
పోస్ట్స్ (ఆటం)
1 అభిప్రాయాలు:
మీ రచనల్ని మీరు తక్కువ చేసుకోకండి. ఉన్నదానితో సాధన చేస్తూ ఎదగటానికి ప్రయత్నించండి. రచనకి ప్రాణం మాటలు. తెలుగులోనూ ఆంగ్లంలోనూ మీ పదసంపదని పెంచుకోండి.సాధనమ్మున పనులు సమకూరు ధరలోన!
మీ అభిప్రాయం