Sunday, July 29, 2007
ఇది చదవండి
చెప్పాను కదా ఎప్పుడో రాసినవి సరదాగా అంతర్జాలంలో పడేద్దామని మొదలు పెట్టాను. నాకు తెలిసీ, తెలియకా ఆమెరికాలో వున్న స్నేహితునికొక్కడికే చెప్పాను నా ఈ బ్లాగు గురించి, అది కూడా ఎవరికీ చెప్పను అన్నాకే.
బ్లాగు రాస్తూ ఎవరికీ చెప్పొద్దు అన్నానంటాడు వీడెవడండీ బాబు అనిపించొచ్చు నిజమే కానీ అప్పట్లో ఎదేదో రాసాను. కొన్ని చెత్త పదాలతో చెత్తవి రాసాను. అందుకే చెప్పొద్దు అన్నది.
ఆ, నా బ్లాగు ఎవరు చూస్తారూ అనుకున్నా. రెండో రోజే రాధిక గారి అభిప్రాయం చూసి డంగైపోయా మరీ ఇంత త్వరగానా అని. రాధిక గారి బ్లాగు తెలుసు, వారు రాసేవాటి నాణ్యత తెలుసు. మరి నేను రాసిన వాటి సంగతి :-( మరి ముందుకు వెళ్దామా ఇక్కడే ఆపేద్దామా అన్న ఆలోచనలో పడ్డా.
నేను రాసిన చెత్తని ఎవరినీ చదవమనలేదు కదా, ఒకసారి చెప్దాము మీరు ఇక్కడ చదవబోయేది గొప్ప విషయాలు కాదు, ఊసుపోక ఒకప్పుడు రాసిన చెత్త అని మళ్ళా మొదలు పెట్టాను. ఇంకో రెండు అభిప్రాయాలు, మాకినేని వారి నుంచి, జల్లెడలో ఈ బ్లాగు చేరుస్తున్నామంటూ.
అందుకే మరొకసారి ఈ విషయం గుర్తుచేసి తర్వాత నా చెత్త నేను రాసుకుందామని ఈ రాతంతా.
బ్లాగర్ టెంప్లేట్స్
సబ్ స్రైబ్ టు
:
పోస్ట్స్ (ఆటం)
0 అభిప్రాయాలు:
మీ అభిప్రాయం