బాధ ఆనందం పంచుకొనే ఓ నేస్తం
దొరకడం నిజంగా నా అదృష్టం
మంచిలోనే చెడుని చూసే ఈ లోకంలో
చెడుని కూడా మంచి చేసే నీవు ఓ అద్భుతం
నీతో గడిపిన ప్రతి క్షణం
మధుర భావాల సమ్మేళనం
మధుర భావాల ఒడిలో నేస్తం
గడిపే ప్రతి క్షణం సుమధురం
నా జీవిత పుస్తకంలో అన్ని పేజీలు నీవే
నా మనసు కాగితంపై అన్ని అక్షరాలూ నీవే
నాలో ప్రవహించే ప్రతి అణువూ నీవే
నా గురించి నేను వెతికితే అక్కడ కనిపించేదీ నీవే
నా మనసులో నీవు చెరగని ముద్ర వేసావు
మనిషిగా నన్ను తీర్చి దిద్దావు
మరపురాని వలపులు నాలో రేపావు
తీయని తలపులతో నా మది గదిని నింపావు
నన్ను నీవు కాదన్నా భరిస్తాను
నన్ను నీవు పొమ్మన్నా జీవిస్తాను
నన్ను నీవు చూడకున్నా బాధపడను
కానీ, నీవు నన్ను మరచిన క్షణం - బ్రతికి వుండను ఇది నిజం
Saturday, June 13, 2009
భగ్న ప్రేమ
నా ప్రేమ మొక్కకు నీ ఆప్యాయతా అనురాగంల నీరు పోసి
నా పిచ్చి మనసుకు నీ హృదయంలో స్థానమిచ్చి
నా ఆశల సౌధానికి అందమైన అనుభూతుల ఊతమిచ్చి
నే కన్న కలలకు హరివిల్లులోని రంగులు వేసి
ఇప్పుడు
పోసినది నీరు కాదు విషమని
స్థానమిచ్చినది హృదయంలో కాదు, కాలికిందని
అవి అనుభూతులు కావు, అనుభూతుల భూతాలని
వేసినవి రంగులు కానే కాదు, అది నే కన్న రంగుల కలయని
తెలియజెప్పి
నా ప్రేమ మొక్కను తుంచివేసి
నా పిచ్చి మనసును పిచ్చెక్కించి
నా ఆశల సౌధాన్ని కూల్చివేసి
నా కలలను మంట కలిపి
ఏం సాధించావు నువ్వు?
నీ తలపులతో నిద్ర లేక
జాగారణమే రణమై
నా మనసుకు నచ్చచెప్పలేక
ప్రతి నిమిషమూ యుగమై
నిన్ను నేను మరువలేక
కాలమే సర్పమై
ఇంతా జరిగాక
ప్రతీదీ నీ రూపమై
నన్ను భాధిస్తుంటే, నీకు సంతోషంగా వుందా?
వెన్నెల ఇంత వేడిగా ఉంటుందని
కాలమింత కఠినమైనదని
మనసును ఒకరికివ్వకూడదని
ప్రేమంటే ఒక బూటకమని
అసలు ప్రేమించే కూడదని
తెలియజెప్పిన ఓ ప్రియా! నీకివే నా జోహార్లు
నా పిచ్చి మనసుకు నీ హృదయంలో స్థానమిచ్చి
నా ఆశల సౌధానికి అందమైన అనుభూతుల ఊతమిచ్చి
నే కన్న కలలకు హరివిల్లులోని రంగులు వేసి
ఇప్పుడు
పోసినది నీరు కాదు విషమని
స్థానమిచ్చినది హృదయంలో కాదు, కాలికిందని
అవి అనుభూతులు కావు, అనుభూతుల భూతాలని
వేసినవి రంగులు కానే కాదు, అది నే కన్న రంగుల కలయని
తెలియజెప్పి
నా ప్రేమ మొక్కను తుంచివేసి
నా పిచ్చి మనసును పిచ్చెక్కించి
నా ఆశల సౌధాన్ని కూల్చివేసి
నా కలలను మంట కలిపి
ఏం సాధించావు నువ్వు?
నీ తలపులతో నిద్ర లేక
జాగారణమే రణమై
నా మనసుకు నచ్చచెప్పలేక
ప్రతి నిమిషమూ యుగమై
నిన్ను నేను మరువలేక
కాలమే సర్పమై
ఇంతా జరిగాక
ప్రతీదీ నీ రూపమై
నన్ను భాధిస్తుంటే, నీకు సంతోషంగా వుందా?
వెన్నెల ఇంత వేడిగా ఉంటుందని
కాలమింత కఠినమైనదని
మనసును ఒకరికివ్వకూడదని
ప్రేమంటే ఒక బూటకమని
అసలు ప్రేమించే కూడదని
తెలియజెప్పిన ఓ ప్రియా! నీకివే నా జోహార్లు
పగిలిన హృదయం
కవిత రాయమని కలాన్ని అడిగితే
కుదరదు పొమ్మని కసిరి కొట్టింది
కమ్మని భావం కురిపించమని కన్నె కనులనడిగితే
కొంటెగా చూసి కవ్వించింది
కావాలని ఏకాగ్రత, మది తలుపు తడితే
కలత నిండిన మది కన్నీరొలికింది
కారణమేమిటని లోకాన్ని అడిగితే
కసిగా చూసి ఫక్కుమని నవ్వింది
మనస్సులోని భావాలను మూటలుగా కట్టాలని ఉన్నా
మాటలు కుదరక మౌనంగా ఉన్నా
మనసనే అద్దంలో నన్ను చూద్దామని అనుకున్నా
పగిలిన ముక్కలు చూసి మౌనంగా రోదిస్తున్నా
మూసిన కనుల వెనుక కలలెన్నో నాడు కన్నా
అవి పగటి కలలే అని నేడు తెలుసుకున్నా
అందని ప్రేమ కోసం నాడు పిచ్చివాడినైనా
అందిన విషం నేడు తాగుతున్నా
కుదరదు పొమ్మని కసిరి కొట్టింది
కమ్మని భావం కురిపించమని కన్నె కనులనడిగితే
కొంటెగా చూసి కవ్వించింది
కావాలని ఏకాగ్రత, మది తలుపు తడితే
కలత నిండిన మది కన్నీరొలికింది
కారణమేమిటని లోకాన్ని అడిగితే
కసిగా చూసి ఫక్కుమని నవ్వింది
మనస్సులోని భావాలను మూటలుగా కట్టాలని ఉన్నా
మాటలు కుదరక మౌనంగా ఉన్నా
మనసనే అద్దంలో నన్ను చూద్దామని అనుకున్నా
పగిలిన ముక్కలు చూసి మౌనంగా రోదిస్తున్నా
మూసిన కనుల వెనుక కలలెన్నో నాడు కన్నా
అవి పగటి కలలే అని నేడు తెలుసుకున్నా
అందని ప్రేమ కోసం నాడు పిచ్చివాడినైనా
అందిన విషం నేడు తాగుతున్నా
బ్లాగర్ టెంప్లేట్స్
సబ్ స్రైబ్ టు
:
పోస్ట్స్ (ఆటం)